ETV Bharat / state

Ap corona cases: 16 వందలకు పైగా కేసులు... 22 మంది మృతి - ఏపీలో కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,628 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 23,570 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్ బారిన పడి 2,744 మంది కోలుకోగా... మరో 22 మంది మృతి చెందారు.

Ap corona cases
కరోనా కేసులు
author img

By

Published : Jul 19, 2021, 7:19 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్తగా 16 వందలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 71,152 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 1,628మందికి పాజిటివ్‌ వచ్చింది. ఫలితంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,41,724కు చేరింది. మరోవైపు 2,744మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,05,000 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

CORONA EFFECT: కరోనా భయంతో ఏడాదిన్నరగా స్వీయ నిర్బంధం

తాజాగా కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ 22 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 5 గురు మృతి చెందగా, కృష్ణాలో నలుగురు, గుంటూరు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మృతుల సంఖ్య 13,154కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్‌ కేసులున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

Ap corona cases
ఏపీలో కరోనా కేసులు

కొవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం వాస్తవమే అయినా.. వైరస్‌ బెడద ఇంకా తొలగిపోలేదు. వైరస్‌ తిరిగి ప్రబలకుండా ఉండాలంటే.. ప్రజలంతా ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మూడోముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో.. మరోవైపు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరిగితే ప్రజారోగ్యం పెను ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని ఆరోగ్యశాఖ భావిస్తోంది. కాలానుగుణ వ్యాధులతో పాటు... కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

ఇదీ చూడండి:'80% కరోనా కేసులకు ఆ వేరియంటే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.