ETV Bharat / state

బాధ్యతలు స్వీకరించిన ఆరుగురు మంత్రులు - పలు శాఖలకు నిధుల విడుదల

Telangana New Ministers Take Charge: హైదరాబాద్‌లోని సచివాలయంలో కొత్త మంత్రులు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు శాఖలకు నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టిన మంత్రులకు అధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Telangana New Ministers Taking Responsibilities
New Ministers of Telangana Taking Charge
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 2:00 PM IST

Updated : Dec 14, 2023, 5:16 PM IST

Telangana New Ministers Take Charge : సచివాలయంలో నేడు కొత్త మంత్రులు బాధ్యతులు చేపట్టారు. శాఖల కేటాయింపు తర్వాత మంత్లు ఆయా సంబంధిత అధికారులు సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేసిన భట్టి దంపతులు, కుటుంబసభ్యులతో కలిసి పూజలు, హోమం చేశారు. అనంతరం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీని విడుదల చేసిన భట్టి విక్రమార్క పలు శాఖలకు నిధులు మంజూరు చేస్తూ తొలి సంతకాలు చేశారు.

మంత్రిమండలి విస్తరణ, ఇతర కీలక పదవుల ఎంపికపై కసరత్తు - దిల్లీ వెళ్లే యోచనలో సీఎం!

ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి రూ.374 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.298కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, సమక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75కోట్ల నిధులు విడుదల చేశారు. ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టికి పలువురు అధికారులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Telangana New Ministers Taking Responsibilities : సచివాలయంలో ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భాధ్యతలు స్వీకరించారు. మరోవైపు రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్​వోలకు అధునాతన కెమెరాలు అందచేసే దస్త్రాలపై తొలి సంతకం చేశారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమశాఖ మంత్రిగా సీతక్క (Seethakka) బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించిన సీతక్కకు పలువురు కార్యకర్తలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - సభ్యుల అభినందనలు

నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రిగా ఉత్తమ్​కుమార్​రెడ్డి (Uttam Kumar Reddy) బాధ్యతలు చేపట్టారు. పలువురు అధికారులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రుల బాధ్యత స్వీకరణ నేపథ్యంలో సచివాలయం దగ్గర సందడి నెలకొంది. పోలీసుల బందోబస్తు నడుమ మంత్రులను సచివాలయంలోకి అధికారులు ఆహ్వానించారు.

తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు - ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించారంటే?

ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు అధికారులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉదయం 9గంటలలోపే మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.మంత్రుల బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో అధికారులు, కార్యకర్తలు తరలిరావడంతో సచివాలయం వద్ద సందడి కనిపించింది.

తెలంగాణ కేబినెట్ కొత్త జట్టు - రేవంత్​తో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీరే

Last Updated : Dec 14, 2023, 5:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.