ETV Bharat / state

Land Market Values: నేటి నుంచి అమల్లోకి కొత్త మార్కెట్​ విలువలు

Land Market Values: వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నేటి నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి. డాక్యుమెంట్‌లు అందజేసి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌లు కాని వారికి... కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. మరోవైపు మార్కెట్ విలువలు పెరగనున్న నేపథ్యంలో గత వారం రోజులుగా వేలాది రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఫలితంగా గత రెండు రోజుల్లో 200 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరింది.

land market value
land market value
author img

By

Published : Feb 1, 2022, 5:33 AM IST

Land Market Values: రాష్ట్రంలో నేటి నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి. కొత్త విలువల కంటే ముందు.. ఆ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. డిసెంబర్‌ నెలలో రికార్డు స్థాయిలో రూ.1261 కోట్ల 88 లక్షల రాబడి వచ్చి రికార్డు నెలకొల్పింది. అయితే జనవరి నెలలో ఏకంగా రూ.14 వందల కోట్లకుపైగా ఆదాయం రావడంతో... ఆ రికార్డును బద్దలు కొట్టినట్లయ్యింది.

గత ఆర్థిక ఏడాదిలో రూ.10 వేల కోట్లు రాబడి తీసుకురావాలని స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. కానీ కొవిడ్‌ ప్రభావంతో ఆ పరిస్థితులు లేకపోవడంతో ఆ లక్ష్యాన్ని 6 వేల కోట్లకు సవరించింది. కేవలం 4 వేల 787 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక ఏడాదిలో 12 వేల 500 కోట్లుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖకు లక్ష్యంగా నిర్దేశించింది. కొవిడ్‌ ప్రభావం లేకపోయినా.. అంత మొత్తం రావడం సాధ్యం కాదని అధికారులు తర్జనభర్జన పడ్డారు. 2021 జులై 22న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, మార్కెట్‌ విలువలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలు ఆదాయం అదనంగా వస్తుందని అంచనా వేశారు. ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు, ఈసీలు, సీసీలు ఇతరత్రా సేవల ద్వారా.. రూ. 9,611 కోట్ల ఆదాయం వచ్చింది.

అనూహ్యంగా పెరిగిన రిజిస్ట్రేషన్లు..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ... వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు చెందిన రిజిస్ట్రేషన్ల మార్కెట్‌ విలువలు మరొసారి పెంచింది. ఇందుకోసం గడిచిన మూడు వారాలుగా కసరత్తు చేసింది. ఫిబ్రవరి నెల ఒకటో తేదీ నుంచి కొత్త విలువలు అమలుల్లోకి వస్తాయని వారం రోజుల కిందట వెలుగులోకి రావడంతో... రిజిస్ట్రేషన్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా రోజుకు 40 నుంచి 50 కోట్లు ఆదాయం వచ్చేది.. వారం రోజులుగా ప్రతి రోజు 100 కోట్లకు తక్కువ లేకుండా రాబడి వచ్చింది. శనివారం రోజున ఏకంగా 10 వేల 719 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి 109 కోట్ల 29 లక్షలు ఆదాయం వచ్చింది. నిన్న కూడా 10 వేలకుపైగా డాక్యుమెట్లు రిజిస్ట్రేషన్‌ జరిగి... దాదాపు వంద కోట్లు రాబడి వచ్చింది. ఇదే ఒరవడితో రాబడి రావడంతోపాటు.. పెరిగిన విలువల వల్ల నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీచూడండి: Registration Value In Telangana: ఖాళీ స్థలాలకు 60 శాతం.. వ్య‌వ‌సాయ భూముల‌కు 150 శాతం పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.