ETV Bharat / state

New Industries Telangana 2023 : తెలంగాణలో కొత్త పరిశ్రమలు.. ఉపాధి కల్పనే ధ్యేయం - ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు

New Industries Telangana 2023 : రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో స్థానికులకు ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమలకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తూనే.. పెద్దసంఖ్యలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తూనే.. ఖాయిలాపడిన వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు సర్కార్‌ తెలిపింది. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి చేపట్టిన చర్యలపై ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది.

Telangana Government
Telangana Government New Industries
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 12:29 PM IST

Telangana Government New Industries కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపిన సర్కార్

New Industries Telangana 2023 : కొత్త పరిశ్రమల ఏర్పాటు(Establishment of New Industries in Telangana) ద్వారా స్థానికులకు కాలుష్య సమస్యలు తలెత్తకుండా.. ప్రత్యేక పారిశ్రామిక వాడల చేపట్టి ఇప్పటివరకు 109 ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. లక్షన్నర ఎకరాల ప్రభుత్వస్థలాన్ని గుర్తించి పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు సమకూరుస్తూ.. పారిశ్రామిక పార్కులు(Industrial Parks) రూపొందిస్తున్నట్లు పేర్కొంది. టీఎస్​ఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమలకు అవసరమైన అన్నివసతులు సమకూరుస్తూ ఇప్పటివరకు 109 పార్కులు ఏర్పాటు చేయగా.. మరో ఐదేళ్లలో 70 పారిశ్రామిక వాడల రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సర్కార్ వివరించింది.

New Industries for Telangana Employment : 2014 నుంచి 2023 వరకు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దిన 7,806 ఎకరాల స్థలాన్ని 3 వేల 680 సంస్థలకు కేటాయించినట్లు తెలిపింది. అక్కడ ప్రారంభమైన పరిశ్రమల ద్వారా 2 లక్షల 63 వేల 222 మందికి ఉపాధి అవకాశాలు లభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తల కోసం.. దండుమల్కాపూర్‌ వద్ద 570 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కు(Green Industrial Park) రూపొందిస్తున్నామని.. 4 వేల మంది చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు 1,200 కోట్లతో తమ వ్యాపారాలు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆ పరిశ్రమల ద్వారా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వివరించింది.

Government Rice Mills in Telangana : ప్రభుత్వ ఆధ్వర్యంలో రైస్​ మిల్లులు.. ఇకనైనా రైతు లబ్దిపొందేనా..!

రైతుకు మద్దతుధర కోసం ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు(Food Processing Zones) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పంటలను ప్రాసెసింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసే సంస్ధలు రాష్ట్రంలోనే పరిశ్రమలు స్థాపించడం ద్వారా కర్షకులకు మద్దతుధర లభిస్తుందనే ఉద్దేశ్యంతో తొమ్మిది జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఐటీ పరిశ్రమలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. టీఎస్​ఐపీఏఎస్ఎస్ ద్వారా.. 2023 మే 11 వరకు 23 వేల 65 యూనిట్లు అనుమతులు పొంది.. 2 లక్షల 61 వేల 732 కోట్లతో కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపింది. తద్వారా 15 లక్షల 74 వేల 798 మందికి.. ఉపాధి అవకాశాలు లభించినట్లు వివరించింది.

మరో 18 వేల 587 యూనిట్లను లక్షా 54 వేల 690 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. వాటి ద్వారా 9 లక్షల 13 వేల 386 మందికి ఉపాధి లభించనున్నట్లు వివరించింది. 2014 నుంచి 2023 వరకు 25 వేల 68 మంది యువ పారిశ్రామికవేత్తలకు.. 3 వేల 654 కోట్ల రాయితీలు అందించినట్లు తెలిపింది. టీప్రైడ్ విధానం ద్వారా 2014 నుంచి 2023 వరకు 28 వేల 184 యూనిట్ల ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 1381.8 కోట్ల ప్రోత్సాహకాలందించినట్లు సర్కారు వివరించింది. దివ్యాంగులకి చెందిన 2104 యూనిట్లకు 114 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పింది.

Industrial Development in Telangana : ఖాయిలాపడిన పరిశ్రమలు ప్రోత్సహించేందుకు ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్‌ ద్వారా ఇప్పటివరకు 550 పరిశ్రమలకి ఆర్థికసాయం అందించి వాటి పునరుద్ధరణకి తోడ్పడినట్లు నివేదికలో ప్రభుత్వం వివరించింది. రామగుండం ఫర్టిలైజర్స్ పునరుద్దరణకి 154 కోట్లు.. మౌలిక వసతుల కల్పనకు మరో 105 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. నష్టాల్లో ఉన్న సిర్పూర్ కాగజ్‌నగర్‌ మిల్‌ను పునరుద్దరించి.. ఉద్యోగులను ఆదుకునేందుకు 87 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 మైక్రో అండ్ స్మాల్‌ ఎంటర్ ప్రైజెస్‌ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వివరించింది.

Food Processing Industries in Telangana : ఊరూరా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

Modern Rice Mills Telangana : త్వరలోనే.. తెలంగాణలో అధునాతన రైస్ మిల్లులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.