ETV Bharat / state

Notifications: మానేయాలా.. వద్దా.. సందిగ్ధంలో ప్రైవేటు ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లకు పచ్చజెండా ఊపడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. దీంతో ప్రైవేట్ ఉద్యోగులు సైతం పోటీ పడేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో సన్నద్ధతకు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం మానేయాలా..?వద్ధా.? అనే సందిగ్ధంలో పడ్డారు. ప్రవేట్ జాబ్​ మానేయాలా? వద్దా? అనే ఆలోచనతో కొట్టుమిట్టాడుతున్నారు.

Notifications
సందిగ్ధంలో ప్రైవేటు ఉద్యోగులు
author img

By

Published : Mar 23, 2022, 6:01 AM IST

ఉద్యోగ నోటిఫికేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడం, వయో పరిమితి పెంచడంతో ప్రైవేటు ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో సన్నద్ధతకు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం మానేయాలా..?వద్ధా.? అనే సందిగ్ధంలో పడ్డారు. ఉద్యోగాలు చేస్తూ ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్న అభ్యర్థులతో పోటీపడగలమా...? అని ఆలోచిస్తున్నారు. కొందరు శిక్షణ కోసం కోచింగ్‌సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. నగరంలో 1,500 కోచింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు అంచనా..18వేల మందికి పైగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో ప్రైవేటు ఉద్యోగాలు మానేసినవారు, ఎక్స్‌ సర్వీస్‌మెన్లు 15శాతానికి మించిఉన్నట్టు శిక్షణ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దని..ఆచితూచి అడుగేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా నేర్పిన పాఠమిదీ..!

కరోనా వల్ల ప్రైవేటుగా పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో చిన్నదైనా సరే ప్రభుత్వ ఉద్యోగమే కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు లక్షల్లో నెల జీతం వస్తున్నా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కాదనుకుని ప్రభుత్వ కొలువు సాధించడంలోనే సంతృప్తి ఉందంటున్నారు మరికొందరు. ఆరు నెలలు సెలవులకు అర్జీలు పెట్టుకున్నారు. యాజమాన్యాలు అంగీకరించకపోవడంతో కొనసాగించాలా.. నిష్క్రమించాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు.

సమతూకం పాటిస్తే..

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుని అటు సాధనకు, ఇటు ఉద్యోగానికి సమయం కేటాయిస్తూ సమతూకం పాటిస్తే విజయం సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంశాలవారీగా సిలబస్‌, నమూనా ప్రశ్నపత్రాలు, గత పోటీ పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు చూసుకుని వర్తమాన అంశాల ఆధారంగా సమకాలీన అంశాలపై పట్టు సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నాలుగు గంటలు.. సాయంత్రం మరో నాలుగు గంటలు కేటాయించాలి. లేదా వారి ఉద్యోగానికి అనువుగా ఉండే సమయాన్ని ఎంచుకోవాలి.

యూపీఎస్సీ తరహాలో సన్నద్ధమవ్వాలి

చాలా మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు శిక్షణ తీసుకోవడంపై సలహాలు అడుగుతున్నారు. ఈ సారి పోటీ పరీక్షల ప్రశ్నావళి యూపీఎస్సీ తరహాలో ఉండే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా సాధన చేస్తేనే విజయం దక్కుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేనివారు సన్నద్ధతకు పూర్తి సమయం కేటాయించొచ్చు. రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు శ్రమిస్తే విజయం సాధించొచ్చు. - ఎం.బాలలత, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.