ETV Bharat / state

గ్రేటర్​లో మళ్లీ డబుల్‌ డెక్కర్ బస్సులు.. - TSRTC Double Decker Buses

New Double Decker Buses in Hyderabad: కొన్ని సంవత్సరాల కిందట మాయమైన డబుల్ డెక్కర్‌ బస్సులు వచ్చే ఏడాది నగరంలో మళ్లీ సందడి చేయనున్నాయి. అప్పట్లో ఎంతో ఆదరణ ఉన్న వీటికి ఇప్పటికీ అంతే డిమాండ్. త్వరలోనే ప్రయోగాత్మకంగా కొన్ని కొత్త బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఇవన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే.

New Double Decker Buses
New Double Decker Buses
author img

By

Published : Oct 21, 2022, 10:58 AM IST

New Double Decker Buses in Hyderabad: కొన్ని సంవత్సరాల కిందట మాయమైన డబుల్ డెక్కర్‌ బస్సులు వచ్చే ఏడాది నగరంలో మళ్లీ సందడి చేయనున్నాయి. వీటిలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు కొత్త బస్సులు ఈ ఏడాది 300, వచ్చే ఏడాది మరో 310 అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే.

వచ్చే ఏడాది రానున్న బస్సులన్నీ అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నవే. ఇందులో 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులున్నాయి. వచ్చేనెల 21 వరకు టెండరు దాఖలు చేయాలని సంస్థ సూచించింది.సొంతంగా కొనలేక మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు విశ్వనగర కీర్తి దిశగా ప్రజారవాణా ఉండాలనే ఉద్దేశంతో డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనాలని టీఎస్‌ ఆర్టీసీ భావించింది. గతంలో టెండర్లు సైతం పిలిచింది. అశోక్‌ లే ల్యాండ్‌ సంస్థ ద్వారా కొనాలని నిర్ణయించినా, తర్వాత ఆర్థిక వనరులు సమకూరక వెనక్కి తగ్గింది.

ఒక్కో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు ధర రూ.2 కోట్లకు పైగా ఉండడం, కేంద్రం రాయితీ రూ.30 లక్షలకే పరిమితమవటంతో నేరుగా కొనాలనే ఉద్దేశాన్ని విరమించుకుంది. 10 డబుల్‌ డెక్కర్లతో పాటు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు అద్దె ప్రాతిపాదికన సమకూర్చుకోనుంది. ఎలక్ట్రికల్‌ బస్సులు నగరమంతటా నడవనుంగా డబుల్‌ డెక్కర్‌వి మాత్రం వంతెనల ఆటంకం లేని మార్గాల్లోనే నడుస్తాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.