ETV Bharat / state

AP New Districts: ఈ తేదీల్లోనే కొత్త జిల్లాల నోటిఫికేషన్‌..!

ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కసరత్తు తుది అంకానికి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుజాగ్రత్తగానే చివరి క్షణంలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

NEW DISTRICTS
NEW DISTRICTS
author img

By

Published : Mar 29, 2022, 10:20 AM IST

AP New Districts: ఆంధ్రప్రదేశ్​లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తూ ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. జిల్లాల పేర్లతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొన్ని ప్రాంతాలను ఇతర రెవెన్యూ డివిజన్లలో కలపడం వంటి అంశాలపై.. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి దాదాపు 10 వేలకు పైగా అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అధికారులు.... ఆయన చేసిన సూచనలకు అనుగుణంగా తుది మెరుగులు దిద్దడంలో నిమగ్నమయ్యారు. గతంలో విడుదల చేసిన ముసాయిదాకు స్వల్పంగా మాత్రమే మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలాజీ జిల్లా పేరు ప్రతిపాదనపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని... తిరుపతి జిల్లాగా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతి జిల్లా పేరును ఖరారు చేస్తూ తుది నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నూతన జిల్లాల్లో పరిపాలన ప్రారంభానికి సంబంధించి ఏప్రిల్ 2వ తేదీని అపాయింటెడ్ డేగా నిర్ణయించారు.

ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం 11 రెవెన్యూ డివిజన్లను కొత్తగా ప్రతిపాదించగా.. ఇప్పుడు అదనంగా మరో 5 డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నూతన జిల్లాలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ పోస్టులతో పాటు.. కేడర్ కేటాయింపుపైనా కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలు కానుండటంతో.. ఆ మేరకు కార్యాలయాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేయాలని అధికారులకు ప్రభుత్వం మార్గనిర్దేశం చేసింది. జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి కార్యాలయాలకు భవనాలు దొరక్కపోవటంతో.. స్వల్ప మార్పులతో పాత భవనాలనే సిద్ధం చేస్తున్నారు. ఫ్లెక్సీలపై కార్యాలయాల పేర్లు ముద్రించి, వాటినే బోర్డులుగా ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చదవండి: రైలెక్కి సెల్ఫీ తీసుకుంటుండగా.. బాలుడికి విద్యుత్ షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.