ETV Bharat / state

నాటకరంగానికి పూర్వవైభవం తీసుకురావాలి : కేవీ రమణాచారి - హైదరాబాద్ తాజా సమాచారం

హైదరాబాద్​లోని దోమలగూడలో ఏర్పాటు చేసిన నాటక కళాకారుల వస్త్ర దుకాణాన్ని బ్రాహ్మణ సంక్షేమసంఘం పరిషత్​ ఛైర్మన్ కేవీ రమణాచారి ప్రారంభించారు. కరోనాతో కుదేలైన నాటక రంగానికి పూర్వవైభవం తీసుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.

new cloty show romm open in hyderabad for dancers
నాటకరంగానికి పూర్వవైభవం తీసుకురావాలి : కేవీ రమణాచారి
author img

By

Published : Nov 22, 2020, 4:00 PM IST

భారతీయ కళాకారులకు ఆధునిక హంగులతో కూడిన వస్త్ర దుకాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు నాగయ్య తెలిపారు. హైదరాబాద్​లోని దోమలగూడలో నాటక కళాకారుల వస్త్ర దుకాణాన్ని బ్రాహ్మణ సంక్షేమ సంఘం పరిషత్ ఛైర్మన్​ కేవీ రమణాచారి ప్రారంభించారు. ప్రముఖ గురువు శోభానాయుడు వద్ద పనిచేసిన నాగయ్య షోరూం ఏర్పాటు చేయడం సంతోషకర విషయమన్నారు.

కళాకారులకు ప్రదర్శన ఎంత ముఖ్యమో వస్త్రాలంకరణ అంతే ప్రధానమని రమణాచారి తెలిపారు. భావితరాలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓలేటి పార్వతీశం, కళాపత్రిక సంపాదకులు మహమ్మద్ రఫీ, ప్రజా గాయని సుద్దాల భారతి, సుజాత మూర్తి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కొవిడ్‌కు సరికొత్త చికిత్స కనుగొన్న తెలంగాణ తేజం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.