సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో నిర్మిస్తున్న తన నూతన క్యాంపు కార్యాలయాన్ని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పరిశీలించారు. అధునాతన హంగులతో, అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనుల తీరు తెన్నుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సెట్విన్ భవన సముదాయాన్ని సైతం పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సెట్విన్ ఎండీ వేణుగోపాల్, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పండగల వేళ రాష్ట్రాలకు కేంద్రం అప్రమత్తత