ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా కేసుల గుర్తింపునకు కొత్త యూప్​ - తెలంగాణలో కరోనా కేసులు

ట్రేసింగ్​.. టెస్టింగ్​.. ట్రీటింగ్​ విధానంలో కరోనా కట్టడికి వైద్యారోగ్య శాఖ కొత్త యాప్​ను రూపొందించిందని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పీహెచ్​సీ స్థాయి వరకు రాపిడ్ యాంటీజెన్​ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల.. కాంటాక్ట్​లకు వెంటనే సమాచారం పంపేలా యాప్​ను రూపొందించినట్లు చెప్పారు. కాంటాక్ట్ పర్సన్స్​కు సందేశం వచ్చిన రోజే.. కరోనా పరీక్ష చేయించుకోవాలంటూ సమాచారం ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. తద్వార తొందరగా ట్రేసింగ్​ చేసేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి లక్షణాలున్నా.. పరీక్షలు చేయించుకోవాలని ఈటల సూచించారు.

corona in telangana
రాష్ట్రంలో కరోనా కేసుల గుర్తింపునకు కొత్త యూప్​
author img

By

Published : Apr 4, 2021, 5:38 AM IST

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొత్త యాప్​ను రూపొందించింది. ట్రేసింగ్​.. టెస్టింగ్​.. ట్రీటింగ్​ విధానంలో కరోనా బాధితుల సన్నిహితుల( కాంట్రాక్ట్స్​ పర్సన్స్​) చరవాణికి సందేశం పంపేలా యూప్​ రూపొందించినట్లు ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్​ వెల్లడించారు.

రాష్ట్రంలో కొవిడ్​ పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్​ సమీక్షించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్​.. తగిన సలహాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు ఈటల పేర్కొన్నారు.

గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆస్పత్రులూ తిరిగి పూర్తి స్థాయిలో కొవిడ్​ చికిత్స కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్లు ఈటల వెల్లడించారు. 33 జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు. అక్కడ 24 గంటలపాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు.

కొవిడ్​ చికిత్స కేంద్రాలుగా..

హైదరాబాద్​లో నేచర్ క్యూర్, ఆయుర్వేద, నిజామియా టీబీ, ఫీవర్, ఛెస్ట్​ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో కరోనా చికిత్స, క్వారంటైన్​ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి ఈటల వెల్లడించారు. వారం రోజుల్లో ఈ కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

లిక్విడ్ ఆక్సిజన్​ ట్యాంక్​లు..

జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, శానిటరీ సిబ్బంది, మందులు, ఆక్సీజన్​ సదుపాయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 22 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా శాశ్వతంగా ఉండేలా లిక్విడ్ ఆక్సిజన్​ ట్యాంక్​లు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.

వారి భయాన్ని సొమ్ము చేసుకోవద్దు..

హోం ఐసోలేషన్​లో ఉండేవారికి సలహాలు ఇవ్వడం, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​లో ఉన్న కాల్​ సెంటర్​ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. కరోనా బాధితుల భయాన్ని సొమ్ము చేసుకోవద్దని.. ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల సూచించారు. ప్రభుత్వం నిర్ధారించిన ధరల ప్రకారమే వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనా బాధితులను తరలించేందుకు 32 ప్రత్యేక 108 వాహనాలను కేటాయించామన్నారు. మందులు, పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీచూడండి: ఆ ఆస్పత్రుల్లో మళ్లీ కొవిడ్ సేవలు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.