నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సందర్శించారు. జూ ఒడిలో ఊపిరిపోసుకుని ఆరోగ్యంగా ఒదిగిన ఆఫ్రికన్ జాతి సింహం కూనలను సందర్శకులు తిలకించే వీలుగా ప్రదర్శనకు పచ్చజెండా ఊపి విడుదల చేశారు. అనంతరం జూలో డక్ పాండ్‌తో పాటు కొంగల కొలనులో వాక్ వేను ప్రారంభించారు. మంత్రి వెంట అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ శాఖ ఉన్నతాధికారి పీకె.ఝూ, ఛీప్ వైల్డ్ వార్డెన్ మునిద్ర, జూ పార్క్‌ల డైరెక్టర్ డా.సిదానందకుక్రేటి, క్యూరేటర్ యన్.క్షితిజ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హైకోర్టులోనే తేల్చుకోండి రవిప్రకాశ్‌కు సుప్రీం సూచన