రాష్ట్రంలో కరోనా తగ్గినట్లే తగ్గి... మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో 278 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 35 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,02,047కి పెరిగింది.
వైరస్‌కు మరో ముగ్గురు బలయ్యారు. ఇప్పటివరకు 1,662 మంది మహమ్మారితో మరణించారు. తాజాగా 111 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 298,120 మంది కొవిడ్‌ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,265 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 830 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదీ చూడండి: దేశంలో భారీగా పెరిగిన కేసులు- కొత్తగా 35,871 మందికి వైరస్