హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కు ఈనెల 6 నుంచి తెరుచుకోనుంది. లాక్డౌన్ కారణంగా మార్చి 15న మూసివేయబడ్డ జూపార్కు.. కొవిడ్ నిబంధనల నడుమ తిరిగి 6న తెరువనున్నట్లు జూపార్కు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
జూపార్కుకు వచ్చే సందర్శకులు తప్పకుండా మాస్క్ ధరించాలని.. లేనిపక్షంలో అనుమతించబడరని జూపార్క్ అధికారులు పేర్కొన్నారు. 10 సంవత్సరాలలోపు పిల్లలు, వృద్ధులు జూపార్కుకు రాకూడదని కోరారు. ప్రతీ సందర్శకుడికి థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు.
బ్యాటరీ వాహనాలలో 50 శాతం మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. కుటుంబం మొత్తం కలిపి బ్యాటరీ వాహనాన్ని బుక్ చేసుకుంటే.. వారికి పూర్తి స్థాయిలో సిట్టింగ్‌కి అనుమతి ఉంటుందన్నారు. జూపార్కులో ఎవరైనా ఉమ్మివేస్తే రూ.1000 జరిమానా విధించబడుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రేపటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలకు అనుమతి