ETV Bharat / state

‘ప్రకటన’లకే పరిమితం.. ప్రయాణికులకేదీ చల్లదనం

హైదరాబాద్‌లో ప్రజారవాణా మరీ తీసికట్టుగా మారుతోంది. ప్రయాణికులంటే లెక్క లేకుండా పోతోంది. బస్టాపుల్లో ప్రయాణికుల ఇబ్బందులు పట్టట్లేదు. నిల్చునేందుకు నీడ ఉండదు.. కూర్చొనేందుకు బల్ల ఉండదు. దశాబ్దాలుగా మారని పరిస్థితిని చక్కదిద్దడానికి జీహెచ్‌ఎంసీ ఎట్టకేలకు నడుం బిగించినా.. ఆదిలోనే అపవాదులు మూట కట్టుకుంటోంది.

Neglected bus stops in Hyderabad
హైదరాబాద్‌లో నిర్లక్ష్యానికి గురవుతున్న బస్టాపులు
author img

By

Published : Apr 12, 2021, 1:52 PM IST

హైదరాబాద్‌ వ్యాప్తంగా ప్రధాన బస్టాపుల్లో ఏసీ బస్సు షెల్టర్లు నిర్మించి... ప్రయాణికులకు చల్లటి నీడనిద్దామనే ప్రయత్నాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మచ్చుకు ఏర్పాటు చేసినవి.... నిర్వహణ సరిగా లేక ప్రయాణికులకు ఉక్కపోతను మిగుల్చుతున్నాయి.

అక్కరకు రాని ఛార్జింగ్‌ పాయింట్లు..

మాదాపూర్‌లోని శిల్పారామం, కూకట్‌పల్లి, సోమాజిగూడ, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఏసీ బస్‌షెల్టర్లు ఏడాదిన్నర క్రితం నిర్మించారు. వరసగా నిర్మించిన వీటిలో కొన్ని ఏసీ షెల్టర్లు కాగా.. మరికొన్ని సాధారణమైనవి ఉన్నాయి. ఈ బస్టాపుల్లో సెల్‌ఫోను, ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ పాయింట్లు పెట్టారు. వైఫై అందుబాటులోకి తెచ్చారు. బస్సుల సంఖ్య తగ్గిపోయిన తరుణంలో ప్రయాణికులకు ఇవి ఎంతో వెసులుబాటుగా ఉండడమే కాకుండా.. అక్కడే భద్రతా సిబ్బంది ఉండడం, సీసీ టీవీలు పని చేయడంతో మహిళా ప్రయాణికులు ఎంతో ఉపశమనం పొందారు. ఇవన్నీ మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. ఖైరతాబాద్‌లోని ఒక బస్‌షెల్టర్‌లో ఏసీ పని చేస్తుండగా.. మిగతాచోట్ల అదీ లేదు.

ఈ ప్రాజెక్టు కొనసాగుతుందా..

నగర వ్యాప్తంగా 826 బస్టాపులు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కేపీహెచ్‌బీ, శిల్పారామం, ట్యాంక్‌బండ్‌, బంజారాహిల్స్‌, సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ సికింద్రాబాద్‌, ఎస్‌పీరోడ్డు, జూబీహిల్స్‌ చెక్‌పోస్టు, రాయదుర్గం వద్ద పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మించి.. తర్వాత దశలవారీ అన్ని చోట్ల ఏసీ, సాధారణమైన బస్సు షెల్టర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మించిన తర్వాత అక్కడ హోర్డింగ్‌ల ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం నిర్వాహకులకే కట్టబెట్టారు. నగరంలో భారీ హోర్డింగులు లేని వేళ.. ఇవి ప్రకటనల వర్షం కురిపిస్తాయనుకున్నారు. కానీ ఆశించినంత ఫలితం లేకపోయిందో ఏమో నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ బస్టాపుల్లో చల్లదనం ఉండేలా.. ఛార్జింగ్‌ పాయింట్లు పని చేసేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'సాగు చట్టాలపై చర్చలకు సిద్ధమే.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.