ETV Bharat / state

'సంజన సమీప బంధువులే నీరజ్​ను హత్య చేశారు' - neeraj murder case accused arrest

Neeraj was killed by Sanjana's close relatives

author img

By

Published : May 21, 2022, 10:54 PM IST

21:30 May 21

'సంజన సమీప బంధువులే నీరజ్​ను హత్య చేశారు'

Honor killing case: హైదరాబాద్‌ బేగంబజార్‌ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్​ను చంపిన నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. అరెస్టైన వారిలో ఓ మైనర్​ బాలుడు ఉన్నాడని.. పశ్చిమ మండల డీసీపీ జోయల్‌ డేవిస్‌ వివరించారు. నిందితులు పథకం ప్రకారమే నీరజ్‌ను కత్తులతో పొడిచి దారుణంగా అంతమొందించినట్టు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. సంజన-నీరజ్​ల వివాహం ఇష్టంలేని సంజన సమీప బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.

''షాయినాత్‌గంజ్‌కు చెందిన సంజనను ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్‌.. కొంతకాలం పాతబస్తీ ఫలక్‌నుమా ప్రాంతంలో నివసించాడు. ఇటీవలే తిరిగి షాయినాత్‌గంజ్‌కు రాకపోకలు సాగించడం మొదలుపెట్టాడు. 10 రోజులుగా అతని కదలికలు గమనించిన సంజన సమీప బంధువులు.. ఎలాగైనా అతడిని అంతమొందించాలని భావించారు. ఇందుకోసం 2 రోజుల క్రితం కత్తులు కొనుగోలు చేశారు. తన తాతతో కలిసి వెళ్తున్న నీరజ్‌ను పథకం ప్రకారం అటకాయించి.. మొదట రాయితో దాడి చేశారు. అనంతరం ఆరుగురు కలిసి కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. విజయ్‌, సంజయ్‌, రోహిత్​తో పాటు మైనర్‌ బాలుడిని అరెస్టు చేయగా.. అభినందన్‌, మహేశ్​ పరారీలో ఉన్నారు.'' - జోయల్​ డేవిస్, పశ్చిమ మండల డీసీపీ

అసలేం జరిగిందంటే..: అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్​ బేగంబజార్‌లో తండ్రి రాజేందర్​నాథ్‌తో కలిసి వేరుశనగ గింజల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. అదే ప్రాంతంలో నివాసం ఉండే సంజనతో నీరజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గతేడాది పాతబస్తీలోని గణేశ్‌టెంపుల్‌లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారం తెలియకపోవడం.. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటంతో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి ప్రాణభయం ఉందంటూ నవదంపతులు అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మేజర్లు కావటంతో పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపగా 'నీరజ్‌-సంజన' కలిసి జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం వారికి బాబు జన్మించాడు. అప్పటికే నీరజ్‌పై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా హతమార్చాలని పథకం వేశారు.

దారుణంగా హత్య..: కొన్ని రోజులుగా నీరజ్‌ కదలికలపై నిఘా పెట్టిన దుండగులు.. రెక్కీ నిర్వహించారు. నిన్న రాత్రి తన తాతయ్యతో కలిసి నీరజ్‌ బయటికి వెళ్లి వస్తుండగా వెంబడించి ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. అతడి తల, మెడపై పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల వద్ద కత్తులు చూసి భయాందోళనకు గురైన స్థానికులు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపుమడుగులో పడి ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే నీరజ్‌ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత కథనాలు..

నా అల్లుడిని చంపినవాళ్లను ఉరి తీయాలి: సంజన తల్లి

నా సోదరులే నీరజ్​ను హత్య చేశారు..: రెండు నెలల బాబుతో సంజన ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.