ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్లో ఎన్సీసీ విద్యార్థులతో ప్రత్యేక యోగ శిక్షణ కార్యక్రమం చేపట్టారు. యోగా మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఎన్సీసీ కమాండర్ ఎం.ఎన్.రెడ్డి అన్నారు. ఇషా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాలో మెళకువలను, సరికొత్త ఆసనాలను తెలియజేశారు. చిన్న వయసులోనే యోగా శిక్షణ మొదలు పెడితే వారికి భవిష్యత్తులో అది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచించారు.
ఇవీ చూడండి: వైభవంగా... కాళేశ్వర గంగ ఉప్పొంగంగా...!