ETV Bharat / state

'నయీం అనుచరులమని బెదిరిస్తున్నారు... రక్షించండి' - human rights commission

గ్యాంగ్​స్టర్​ నయీంను మట్టుబెట్టినా అతని అనుచరులమంటూ కొంతమంది ఇంకా ప్రజలను వేధిస్తూనే ఉన్నారు. ఎల్బీనగర్​కు చెందిన దంపతుల ఇంటికి సంబంధించి నయీ అనుచరులమని కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితులు తమను రక్షించాలంటూ హెచ్​ఆర్సీని ఆశ్రయించారు.

మానవ హక్కుల సంఘం
author img

By

Published : May 4, 2019, 5:52 PM IST

నయీం అనుచరులమంటూ బెదిరింపులకు పాల్పడుతోన్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఎల్బీనగర్​కు చెందిన దంపతులు హెచ్​ఆర్సీని ఆశ్రయించారు. ఎల్బీనగర్​కు చెందిన గుండు గీత అబ్దుల్లాపూర్​ మెట్​లోని గిల్లాపూర్​లో 2017లో స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఇటీవల లాజిస్టిక్​ పార్కు ప్రకటన చేయడం వల్ల అక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగాయని బాధితులు తెలిపారు.

నయీం అనుచరులమంటూ బెదిరింపు

గత నెల 23న తమ ఇంటి ప్రహరీని లింబగిరి స్వామి అనే వ్యక్తి కొందరితో వచ్చి కూల్చేశారని కమిషన్​ దృష్టికి తెచ్చారు. అడిగితే నయీం అనుచరులమంటూ బెదిరిస్తున్నారని గీత హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. నిందితుల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు.

మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాధిత మహిళ

ఇదీ చూడండి : స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.