ETV Bharat / state

నవీన్ హత్య కేసు.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు..!

Naveen Murder Case update: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయి విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్​ను ఎలాగైనా అడ్డు తొలగించి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేయాలని ప్లాన్​ వేసినట్లు హరిహర కృష్ణ పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. 3 నెలల క్రితమే బుర్రలో ఆలోచన పుట్టగా.. నెల రోజుల ముందే పదునైన కత్తి కొనుగోలు చేసి.. ఫిబ్రవరి 17న దారుణంగా హత్య చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుని హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

naveen murder
నవీన్ హత్య
author img

By

Published : Mar 4, 2023, 10:54 PM IST

Updated : Mar 4, 2023, 10:59 PM IST

Naveen Murder Case Updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు రెండోరోజూ విచారించారు. పలు ప్రశ్నలను అడగగా.. ఎటువంటి భయంలేకుండా, జంకకుండా సమాధానాలు చెప్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా ఉదయం సీన్​ రీకన్​స్ట్రక్షన్​ చేసిన పోలీసులు.. హరిహరకృష్ణను సాయంత్రం మరోసారి బయటకు తీసుకెళ్లారు. సరూర్ నగర్ సీసీఎస్ కార్యాలయంలో విచారిస్తున్న హరిహరకృష్ణను ఓ వాహనంలో ఎక్కించుకొని పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. నిందితుని నుంచి హత్య జరిగిన తీరును పోలీసులు అడిగి తెలుసుకున్నారు.

మలక్​పేట్​ సలీంనగర్​లోని అపార్ట్​మెంట్​లోకి హరిహరకృష్ణను తీసుకెళ్లిన పోలీసులు.. కాసేపు అక్కడ ఉన్న తర్వాత తిరిగి తమ వెంట వాహనంలో తీసుకెళ్లిపోయారు. నవీన్​ను హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ ఇంటికి వెళ్లడంతోనే.. పోలీసులు అతని ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కస్టడీలో భాగంగా హరిహర కృష్ణ చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పినట్లు సమాచారం. అబ్దుల్లాపూర్​మెట్​ పోలీసులకు లొంగిపోయిన రోజు చెప్పిన అంశాలనే వివరిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో రోజు అతడు చెప్పిన కొన్ని విషయాలు పోలీసులను సైతం ఉలికిపాటుకు గురిచేసేలా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.

హత్య జరిగిన స్థలం, హరిహర కృష్ణ నివాసం ఉండే అంబర్​పేట్​లోని తన నివాసానికి వెళ్లి, బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి తీసుకెళ్లి పోలీసులు అన్ని వివరాలు సేకరించారు. 17వ తేదీ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి హత్య జరిగే వరకు, ఆ తర్వాత హరిహర కృష్ణ ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాలన్నింటికీ నిందితుడిని తీసుకెళ్లారు. తొలుత నిందితుడిని మూసారాంబాగ్​లోని అతడి సోదరి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అక్కాబావల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు నిందితుడు నవీన్​తో కలిసి మూసారాంబాగ్ నుంచి పెద్దఅంబర్​పేట్ వరకు ఆదే మార్గంలో ప్రయాణించారు.

పెద్దఅంబర్ పేటలోని తిరుమల మద్యం దుకాణం వద్ద నిందితుడిని దింపి మద్యం కొనుగోలు, మద్యం తాగిన ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య జరిగిన రోజు జరిగిన ఘటనలపై ఆరా తీశారు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గొడవకు దారితీసిన అంశాలపైనా నవీన్ హత్యకు ముందు జరిగిన విషయాలు ఎలా హత్య చేసింది.. హత్యానంతరం నవీన్ శరీర భాగాలను వేరు చేయటం తదితర కీలక వివరాలు రాబట్టేందుకు సుమారు గంట సమయం పోలీసులు అక్కడే ఉన్నట్టు సమాచారం.

యువతి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు.. నిందితుడికి బయటి వ్యక్తులు సహకరించినట్టు విచారణలో తేలితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని రాచకొండ సీపీ డీఏస్ చౌహన్ పేర్కొన్నారు. హత్య కేసులో యువతి ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. హత్య కేసులో నవీన్ చరవాణి కీలకంగా మారనుంది. ఘటన జరగటానికి ముందు నుంచి నవీన్, హరిహరకృష్ణ, యువతి మధ్య జరిగిన సంభాషణపైనా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతి నిందితుడి ఫోన్ సమాచారాన్ని తొలగించినట్లు పోలిసులు గుర్తించారు. మరో పక్క నవీన్ ఫోన్ ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 4, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.