ETV Bharat / state

Naveen Murder Case: మరిన్ని చోట్ల సీన్‌ రీకన్‌స్ట్రక్షన్..

Naveen murder case updates: సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో కస్టడీలో ఉన్న హరిహరకృష్ణ నుంచి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యానంతరం పోలీసుల ముందు లొంగిపోయిన హరిహర కృష్ణ.. జైలులో ఉండగా బయట ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. చర్లపల్లి జైలులో ఉండగా ములాఖత్‌లో అతని తండ్రి కలిసినప్పుడు కేసులో పోలీసులు ఇంకా ఎవరినైనా అరెస్టు చేశారా? అని ఆరా తీసినట్లు సమాచారం. మూడు నెలల ముందు నుంచి నవీన్‌పై కక్ష పెంచుకున్న తీరు.. హత్య చేయడం వరకు జరిగిన అన్ని అంశాలపై పోలీసులు పక్కాగా వివరాలు సేకరిస్తున్నారు.

Naveen murder case
Naveen murder case
author img

By

Published : Mar 6, 2023, 9:34 AM IST

Naveen murder case updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నవీన్‌ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసుకు సంబంధించిన ఆధారాలతో పాటు మరిన్ని వివరాలు రాబట్టేందుకు మూడో రోజు మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. నవీన్​ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ వరంగల్ వెళ్లి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై కోదాడ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ బైక్‌ను స్థానికంగా పార్కింగ్ చేసి.. ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నానికి వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఆ ప్రాంతాలకు వెళ్లడానికి కారణాలు, అక్కడ ఎవరైనా సహకరించారా? లేక ఎవరి ఇంట్లోనైనా ఆశ్రయం పొందాడా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక బృందంతో హరిహరను కోదాడ తీసుకెళ్లారు. త్వరలోనే మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశముంది.

హరిహర కృష్ణ ఫోన్‌ డేటాపై పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. నవీన్‌ను మూడు నెలల క్రితమే హత్య చేయాలని హరిహర నిర్ణయించుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ మూడు నెలల వ్యవధిలో ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడాడు.. బయట ఎవరిని కలిశాడు. ఎక్కువ సమయం ఎవరితో గడిపాడు. ఈ హత్యలో బయటి వ్యక్తుల హస్తం ఉందా? అనే కోణంలో హత్య వివరాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గత డిసెంబరు నుంచి అతని ఫోన్ కాల్‌ డేటా విశ్లేషించి కొందరి పేర్లతో ఒక జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో వారిని ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నవీన్, హరిహర ఇంటర్ ఒకే కాలేజీలో చదవగా.. వారికి పది మంది స్నేహితులు సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్ నుంచి ఇప్పటి వరకు నవీన్, హరిహర మధ్య ఏం జరిగింది? హత్యకు దారితీసిన పరిణామాలపై స్నేహితుల ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అతని మిత్రుల ఇళ్లకు ప్రత్యేక బృందాలను పంపి వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.

హత్య తర్వాత పోలీసుల ముందు లొంగిపోయిన హరిహరకృష్ణ జైలులో ఉండగా బయట ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. చర్లపల్లి జైలులో ములాఖత్‌లో అతని తండ్రి కలిసినప్పుడు కేసులో పోలీసులు ఇంకా ఎవరినైనా అరెస్టు చేశారా ? అని ఆరా తీయడంతో కుట్రలో ఇంకా కొందరి ప్రమేయం ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హత్యకేసులో మరింత లోతుగా పోలీసుల విచారణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.