ETV Bharat / state

నత్తనడకన యాసంగి.. - govt

గతంతో పోలిస్తే ఈసారి యాసంగిలో సాగు విస్తీర్ణం 21 శాతం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.

యాసంగి సాగు
author img

By

Published : Feb 14, 2019, 6:05 AM IST

Updated : Feb 14, 2019, 9:46 AM IST

యాసంగి సాగు
రాష్ట్రంలో యాసంగి పంటల సాగు ఇంకా పుంజుకోలేదు. మరో నెలన్నరలో రబీ సీజన్ ముగుస్తున్నా.. ఇప్పటికీ అన్ని పంటల సాగు విస్తీర్ణం సాధారణం కన్నా 21 శాతం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో ఈ యాసంగి పంట కాలంలో సాధారణ విస్తీర్ణం 13.38 లక్షల హెక్టార్లకుగాను ఇప్పటి వరకు 10.55 లక్షల హెక్టార్లలోనే విత్తనాలు, నాట్లు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి మరో లక్షా 46 వేల హెక్టార్లు సాగవడం గమనార్హం. ఆహార ధాన్యాల సాగు 84, నూనెగింజల పంటల సాగు 66 శాతం విస్తీర్ణంలో ఉంది. సెనగ పంట ఒక్కటే 100 శాతం కన్నా అధికంగా వేయటం వల్ల పప్పుధాన్యాల సాగు 3 శాతం పెరిగింది.
undefined

గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 855.1 మిల్లీమీటర్లకుగాను 720.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా జిల్లాల్లో సాధారణం కన్నా 20 నుంచి 45 శాతం దాకా వర్షపాత లోటు ఏర్పడింది. వర్షాలు లేనందున భూగర్భ జలమట్టం తగ్గిపోయింది. నీటి కొరత వల్ల వరి సాగు అంతంత మాత్రంగా ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల యాసంగి సాగు నత్తనడకన సాగుతోందని వ్యవసాయాధికారులు తెలిపారు.

Intro:TG_ADB_11_13_VADRANGULA RYALI_AV_C6

Body:తెలంగాణ రాష్ట్రంలో అడవులను రక్షించాలని తెరాస ప్రభుత్వం చేపట్టిన జంగిల్ బచావో - జంగిల్ బడావో పేరుతో కలప ఆధారిత కుటీర పరిశ్రమలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణులు ఆధ్వర్యంలో వడ్రంగులు నిరసన ర్యాలీ చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని సుమారు 500 మంది కలప ఆధారిత కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్రంగి సంగీయులు కలెక్టరేట్ ముందు బైఠాయించారు. సెంట్రల్ పాలసీకి అనుబంధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో55 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల కుటుంబాలు దీనావస్థ స్థితిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ కుల వృత్తినే దైవంగా భావించే విశ్వబ్రాహ్మణుల పనిముట్లను అటవీ అధికారులు లైసెన్సులు తీసుకోమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవులలో కలప స్మగ్లింగ్ చేయడం లేదని కేవలం కలప పైనే ఆధారపడి జీవనోపాధి గడుపుతున్న కుటుంబాల ను రోడ్డుపాలు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేవలం అటవీ అధికారులకు అవగాహన లోపంతోనే తమపై పిడి యాక్టు కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.

బైట్; తిరుపతి, కలప ఆధారిత కుటీర పరిశ్రమ నిర్వహకుడు

Conclusion:
Last Updated : Feb 14, 2019, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.