ETV Bharat / state

NWDA Meeting: 'గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్​లను త్వరగా ఆమోదించాలి' - కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్

గోదావరి బేసిన్​లో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా తాము సమర్పించిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్​లను వేగంగా ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను కోరింది. దిల్లీ విజ్ఞాన్ భవన్​లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (union minister Gajendrasingh Shekhawat) అధ్యక్షతన జాతీయ జల అభివృద్ధి సంస్థ (National Water Development Agency) 35వ వార్షిక సమావేశం జరిగింది.

NWDA Meeting
NWDA Meeting
author img

By

Published : Nov 13, 2021, 5:05 AM IST

Updated : Nov 13, 2021, 6:47 AM IST

దిల్లీ విజ్ఞాన్ భవన్​లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (union minister Gajendrasingh Shekhawat) అధ్యక్షతన జాతీయ జల అభివృద్ధి సంస్థ 35వ వార్షిక సమావేశం జరిగింది (National Water Development Agency). నదుల అనుసంధానం ప్రత్యేక కమిటీ 19వ సమావేశం కూడా జరిగింది. రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ హరిరాం (Irrigation Department Gajwel ENC Hariram) ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే (Chief Minister OSD Sridhar Deshpande) పాల్గొన్నారు. గోదావరి - కావేరి అనుసంధానంపై (connectivity of Godavari Cauvery rivers) సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను సమావేశంలో మరోమారు వివరించారు. గోదావరి జలాలను మళ్లించాలని ప్రతిపాదిస్తున్న ప్రాంతం వద్ద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం జరగాలని తెలిపారు. ఎన్​డబ్ల్యుడీఏ చెప్తున్నంత నీరు లేదని అధికారులు అన్నారు.

ఈ నేపథ్యంలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం (Central Water Association) ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం జరగాలని ఆన్నారు. భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల తాము సమర్పించిన ఆరు.. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్​లను (Godavari projects DPRS) వీలైనంత త్వరగా పరిశీలించి ఆమోదించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను కోరారు. తద్వారా గోదావరి బేసిన్​లో తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించినట్లవుతుందని అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి: KRMB LETTER : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

Last Updated : Nov 13, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.