హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నేషనల్ సిల్క్ ఎక్స్ ఫో -2019 పేరిట ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను వర్థమాన సినీ నటి సేజిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శిస్తూ నటి సేజిల్ సందడి చేశారు. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని సేజిల్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా చేనేత కార్మికులకు మరింత ప్రోత్సహిం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
రానున్న పండుగలు, వెడ్డింగ్ సీజన్ సందర్భంగా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ఈ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలో 14 నగరాలకు చెందిన చేనేత కళాకారులు, డిజైనర్లు రూపొందించిన వస్త్ర ఉత్పత్తులు దాదాపు 80 స్టాళ్లలో కొలువుదీరిన.... ఈ ప్రదర్శన నవంబర్ 18 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం