హైదరాబాద్ నాంపల్లిలోని కలెక్టరేట్లో షెడ్యూల్ కులాల అభివృద్ధిపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్లను ఎక్కువమొత్తంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడంలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో హైదరాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్నారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంలో కూడా వివక్ష చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె.మానిక్ రాజ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
'అట్రాసిటీ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు' - k ramulu
షెడ్యూల్ కులాల అభివృద్ధిపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో హైదరాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.