నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతినే తప్ప వర్ధంతిని చేయలేని గొప్ప వ్యక్తి అని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న నేతాజీ విగ్రహానికి పూల మాల వేసి.. నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపికా, రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ సుచిత్రతో పాటు భాజపా నాయకులు పాల్గొన్నారు.
సుభాష్ చంద్రబోస్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని లక్ష్మణ్ తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతమాత సంకెళ్లను తొలగించేందుకు చేసిన ఉద్యమం ఎంతో గొప్పదని కొనియాడారు.
భారత యువకులను సంఘటితం చేసి... స్వాతంత్య్ర పోరాటంలో తమదైన శైలిలో పోరాడిన ఘనత నేతాజీకి దక్కుతుందని అన్నారు. జీహెచ్ఎంసీ మేయర్‌ను త్వరగా ఎన్నుకోవాలని.. పాత కార్పొరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేయడం, బడ్టెట్ విడుదల చేయడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. వెంటనే మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని లేనిపక్షంలో ఆందోళనలకు సిద్దమని హెచ్చరించారు.