రాష్ట్రంలో పోలీసు అధికారుల వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించనందుకు డీజీపీ మహేందర్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రత్యక్షంగా హాజరై రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ 22న కరీంనగర్ నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీ సందర్భంగా ముజీబ్ అనే వ్యక్తిని ఉద్దేశించి కరీంనగర్ ఎసీపీ అశోక్‌తో పాటు అక్కడి ఎస్బీ ఇన్పెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ముజీబ్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
కేసును గత జనవరి 22న పరిగణలో తీసుకన్న కమిషన్.. ఆ వ్యవహారంలో ఇద్దరు పోలీసు అధికారులపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని డీజీపీని గతంలోనే ఆదేశించింది. మే 12 లోపు రిక్విసైట్ రిపోర్ట్ అందకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసింది.
ఇదీ చదవండి: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వార్నర్‌సేన విజయం