ETV Bharat / state

రహదారులు గుంతలమయం... ప్రయాణం నరకం

author img

By

Published : Aug 30, 2020, 5:19 AM IST

జాతీయ ర‌హ‌దారుల్లో ప్రయాణ‌మంటేనే ప్రజ‌లు వ‌ణికిపోతున్నారు. గుంత‌ల‌మ‌యంగా మారిన రోడ్లపై ప్రయాణం చేస్తూ... అనారోగ్య బారిన పడుతున్నారు. వాహనాలూ మరమ్మతులకు గురవుతున్నాయి. రాత్రి వేళ ప్రయాణమంటే... ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారులు 435 కిలోమీటర్ల మేర ఎక్కువగా దెబ్బతిన్నాయి.

National Highways Damaged Peoples Facing Problems in Telangana
రహదారులు గుంతలమయం... ప్రయాణం నరకం

రాష్ట్ర ప‌రిధిలో ఉన్న జాతీయ ర‌హ‌దారులు అధ్వాన్నంగా త‌యార‌య్యాయి. సరైన నిర్వహణ లేకపోవడం దానికి తోడు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లు గుంతలమయంగా మారాయి. రాష్ట్రంలో 23 జాతీయ ర‌హ‌దారులు 3,824 కిలోమీటర్ల మేర‌ విస్తరించి ఉన్నాయి. వీటిలో రోడ్లు, భ‌వ‌నాల శాఖ ఆధ్వర్యంలో 1,551 కిలోమీటర్లు.. మిగిలిన 2 వేల 273 కిలోమీటర్లు భార‌త జాతీయ ర‌హ‌దారుల సంస్థ కింద‌కు వ‌స్తాయి. ఎన్​హెచ్​ఏఐ ప‌రిధిలో ఉన్న ర‌హ‌దారులు సుమారు 435 కిలోమీటర్ల మేర చాలా దెబ్బతిన్నాయ‌ని రోడ్లు భ‌వ‌నాల శాఖ అధికారులు తేల్చారు.

అంతటా ఇదే పరిస్థితి

జ‌గిత్యాల‌-క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్-ఖ‌మ్మం మార్గాల్లో సుమారు 250 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ర‌హ‌దారుల్లో సుమారు 100 కిలోమీటర్ల మేరు ర‌హ‌దారులు చెడిపోయాయి. ఖ‌మ్మం-అశ్వారావుపేట‌, గ‌జ్వేల్-జ‌గ్‌దేవ్‌పూర్ రూట్‌లో సుమారు 120 కిలోమీటర్ల ప‌రిధిలో విస్తరించి ఉన్న ర‌హ‌దారుల్లో సుమారు 70 కిలోమీటర్ల మేర‌ దెబ్బతిన్నాయి. వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారికి సంబంధించి నగరంలో ఎక్కువ శాతం రోడ్లు దెబ్బతిన్నాయి. హైద‌రాబాద్-మ‌న్నెగూడ ర‌హ‌దారిలో సుమారు 45 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి.

అరచేతిలో ప్రాణాలు...

గుంత‌ల‌మయ‌మైన ర‌హ‌దారుల‌పై ప్రయాణించాలంటే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వ‌స్తుంద‌ని వాహ‌దారులు ఆందోళోన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా గుంత‌ల్లో ప‌డి ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గుంతల్లో వాహనాలు వెళ్లడం వల్ల వెన్నునొప్పి ఇబ్బందులు ఎక్కువ మందిని వెంటాడుతున్నాయి. పెద్ద పెద్ద గుంతల్లో పడి కార్లు, బండ్లు దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

నిధులు ఇవ్వని కేంద్రం

రోడ్లు భ‌వ‌నాల‌శాఖ ప‌రిధిలో ఉన్న రోడ్లను ఎప్పటిక‌ప్పుడు మరమత్తు చేస్తున్నామ‌ని... కేవ‌లం జాతీయ ర‌హ‌దారుల ప‌రిధిలో ఉన్న రోడ్లు మాత్రమే అధ్వాన్నంగా త‌యార‌య్యాయ‌ని రోడ్లు భ‌వ‌నాల శాఖ ఇంజ‌నీరింగ్ చీఫ్ గ‌ణ‌ప‌తిరెడ్డి తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా రోడ్లు మరమ్మతులు చేయాలంటే సుమారు 235 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ నిధులు మంజూరు చేయాలని కేంద్ర సర్కారుకు విజ్ఞప్తి చేసినా సమాధానం లేదన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు త‌క్షణ‌మే జాతీయ రహదారులపై దృష్టిసారించి వాటిని మరమ్మతులు చేయాల‌ని వాహ‌దారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.