కేంద్రం మంజూరు చేసిన 1000 జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను (కేఐసీ) అత్యధిక శాతం తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సమష్టిగా కృషి చేద్దామని జాతీయ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు అన్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ "మిషన్ 2024 ఒలింపిక్స్"లో భాగంగా దేశ వ్యాప్తంగా కేఐసీలను నెలకొల్పానుకోవడం హర్షణీయమని చెప్పారు.
ఈ సెంటర్లను ఎన్ఐఎస్ కోచ్లు, మాజీ ఒలింపియన్లు, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు సొంతంగా నిర్వహించడానికి కేంద్ర క్రీడాశాఖ సహాయం అందించనుందని తెలిపారు. అకాడమీ స్థాపన లేదా కేఐసీ సెంటర్లో కోచ్గా పనిచేసే ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, దీనికి టీ స్పోర్ట్స్ హబ్ అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. ఆసక్తి గల వారు 9703299999 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
2024 ఒలింపిక్స్లో భారత్ తరఫున అత్యధిక పతకాలు తెలంగాణ బిడ్డలే సాధించేలా చక్కటి క్రీడా వాతావరణాన్ని నెలకల్పాలని.. టీ స్పోర్ట్స్ హబ్ నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జగన్మోహన్ రావు తెలిపారు.
ఇదీ చూడండి: మూడు నెలల తర్వాత మైదానంలో ఇషాంత్