ETV Bharat / state

ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డికి నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్ - జాతీయ మహిళా కమిషన్

National Commission for Women notices to MLC Padi KaushikReddy: ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. ఈనెల 21న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. గవర్నర్​పై ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో బీసీ రాజకీయ ఐకాస ఫిర్యాదు చేసింది.

MLC Padi Kaushik Reddy
MLC Padi Kaushik Reddy
author img

By

Published : Feb 19, 2023, 8:43 PM IST

Updated : Feb 19, 2023, 9:25 PM IST

National Commission for Women notices to MLC Padi KaushikReddy: ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డికి ఈనెల 14న జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. ఈనెల 21న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ ఈ నోటీసులు ఇచ్చింది.

Complaint on MLC Kaushik Reddy in HRC: గవర్నర్​పై ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో బీసీ రాజకీయ ఐకాస ఫిర్యాదు చేసింది. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకై డీజీపీకి ఆదేశాలివ్వాలని... ఐకాస ఛైర్మన్ రాచాల యుగేందర్​గౌడ్ ఎస్‌హెచ్‌ఆర్సీని కోరారు.

గవర్నర్​పై వివాదాస్పద వ్యాఖ్యలు: పాడి కౌశిక్ రెడ్డి జనవరి 25న జమ్మికుంటలో నిర్వహించిన ఓ సమావేశంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తన దగ్గరే అంటి పెట్టుకొని కూర్చుంటారా అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఇప్పుడు నేషనల్ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ వరకు వెళ్లింది.

ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: మరోవైపు గవర్నర్ తమిళిసై పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కౌశిక్​రెడ్డిని బర్తరఫ్ చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్​ను మహిళ అని కూడా చూడకుండా వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. కౌశిక్​రెడ్డిని చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

మహబూబ్​నగర్​ ఆసుపత్రి డయగ్నస్టిక్​ హబ్​కు అక్రిడేషన్​బోర్డు గుర్తింపు

Last Updated : Feb 19, 2023, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.