ప్రైవేట్ ఉపాధ్యాయులపై సమస్యలపై జాతీయ బంజారా మిషన్ ఇండియా సభ్యులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. జీతాలు ఇవ్వకుండా ప్రైవేట్ విద్యాసంస్థలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని జాతీయ బంజారా మిషన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ నాయక్ పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకుని నాలుగు నెలలుగా ఉపాధ్యాయులకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాలు ఇవ్వని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి జీతాలు ఇచ్చేలా చూస్తామని మంత్రి సబితా హామీ ఇచ్చారు. జీతాలు ఇవ్వకున్నా.. ఉగ్యోగాల నుంచి తీసేసినా తమ దృష్టికి తీసుకురావాలని అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్