Shilpa chowdary Bank Lockers: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాల ప్రకారం శిల్పా చౌదరిని పోలీసులు ఒక్క రోజు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో భాగంగా పోలీసులు ఆమె బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాకు సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకు లాకర్‌లో ఏమీ లభించకపోవడంతో నిందితురాలిని తిరిగి నార్సింగి ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇతరుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా.. వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఆమె పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మోసం బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండ ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు.. ఈ ఏడాది కాలంలో వారిద్దరూ కలిసి ఎక్కువగా ఎవరితో మాట్లాడారనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు. శిల్పా చౌదరిని రేపు ఉదయం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చి, అక్కడి నుంచి చంచల్ గూడ మహిళా జైలుకు తరలించనున్నారు.
Shilpa chowdary Case: అంతుకుముందు ఒకరోజు కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడం వల్ల చంచల్‌గూడ జైలు నుంచి శిల్పను ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గోల్కొండ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నార్సింగి కార్యాలయానికి తరలించారు. నార్సింగి పీఎస్‌లో ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. 7 కోట్ల రూపాయల తీసుకొని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి:
- Shilpa Fraud: పార్టీలు ఇచ్చి ఆకర్షించి.. కోట్లలో వసూలు చేసి..
- Shilpa Chowdary Police Custody: రూ.7కోట్లు తిరిగిచ్చేస్తా.. పోలీసుల విచారణలో శిల్పా చౌదరి
- Shilpa Chaudhary case: శిల్పా చౌదరిని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
- Shilpa Chowdary Cheating Case: శిల్పా చౌదరి కేసులో తెరమీదకు కొత్త పేర్లు
- Shilpa Chowdary Cheating Case : శిల్పాచౌదరి చేతిలో మోసపోయిన హీరో మహేశ్‌బాబు సోదరి