ETV Bharat / state

'పద్నాలుగు ఏళ్లు కష్టపడ్డాం.. కాస్త కనికరించండి' - ఉపాధి హామీ​ ఫీల్డ్​ అసిస్టెంట్లు ఆందోళన

ఉపాధి పనుల్లో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన తమకు.. లక్ష్యాలు పెట్టి ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమని ఉపాధి హామీ​ ఫీల్డ్​ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ హిమాయత్ నగర్​లో నిరసన చేపట్టారు.

narega Field Assistants protested in front of panchayath raj commissionerate in Himayat Nagar
'పద్నాల్గేళ్లు కష్టపడ్డాం.. విధుల్లోకి తీసుకోండి'
author img

By

Published : Feb 18, 2021, 12:05 PM IST

హైదరాబాద్ హిమాయత్ నగర్​లో ఉపాధి హామీ​ ఫీల్డ్​ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ.. పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. రోడ్డు మీద మోకాళ్లపై కూర్చొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి చేతులు జోడించి వేడుకున్నారు.

14 ఏళ్లుగా ఉపాధి పనుల్లో సేవలందించిన తమకు.. లక్ష్యాలు పెట్టి ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమని సంఘం అధ్యక్షులు మేకల రవి ఆవేదన వ్యక్తం చేశారు. 11 నెల్లుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మానసికంగా కుంగిపోయిన 23 మంది.. ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: న్యాయవాదుల ఆందోళన.. విధుల బహిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.