LOKESH YUVAGALAM PADAYATRA: ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరిస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కొమ్మరమడుగులో పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అరటి రైతులతో భేటీ అయిన ఆయన.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడి అవుతోందని రైతులు లోకేశ్ ఎదుట వాపోయారు. ఎరువులు, కూలీలు, విత్తనం ధర భారీగా పెరిగాయన్నారు. కిలోకు 15 రూపాయల ధర కూడా రావడం లేదన్నారు. వారి సమస్యలు విన్న లోకేశ్.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడతానన్నారు.
పలమనేరు నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర ఐదో రోజు ఉత్సాహంగా సాగుతోంది. కృష్ణాపురం టోల్‌గేట్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. కస్తూరి నగరం క్రాస్ వద్ద గౌడ సామాజికవర్గంతో భేటీ కానున్నారు. కైగల్లు వద్ద యాదవ సామాజికవర్గం, మధ్యాహ్నం దేవదొడ్డి గ్రామంలో కురుమ సామాజికవర్గంతో భేటీ అవుతారు. సాయంత్రం బైరెడ్డిపల్లెలో బీసీ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొంటారు.
-
పలమనేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా స్థానిక యువత, ప్రజలతో సమావేశం అయిన శ్రీ నారా లోకేష్, "2019 లో ఓడిపోయింది ఒక రాజకీయ పార్టీ కాదు అని, రాష్ట్రం.." అని అన్నారు. (1/2) pic.twitter.com/Od0Fz4XXdA
— Telugu Desam Party (@JaiTDP) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">పలమనేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా స్థానిక యువత, ప్రజలతో సమావేశం అయిన శ్రీ నారా లోకేష్, "2019 లో ఓడిపోయింది ఒక రాజకీయ పార్టీ కాదు అని, రాష్ట్రం.." అని అన్నారు. (1/2) pic.twitter.com/Od0Fz4XXdA
— Telugu Desam Party (@JaiTDP) January 31, 2023పలమనేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా స్థానిక యువత, ప్రజలతో సమావేశం అయిన శ్రీ నారా లోకేష్, "2019 లో ఓడిపోయింది ఒక రాజకీయ పార్టీ కాదు అని, రాష్ట్రం.." అని అన్నారు. (1/2) pic.twitter.com/Od0Fz4XXdA
— Telugu Desam Party (@JaiTDP) January 31, 2023
ఇవీ చదవండి:
ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
రాజాసింగ్కు మరోసారి పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..?
ఎన్నాళ్లీ వ్యధ.. హైదరాబాద్ వాసులకు తప్పని ట్రాఫిక్ బాధ
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: హైకోర్టు