Nara Lokesh Respond on Chandrababu Arrest : తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాలలో అరెస్టు తర్వాత ఆయన ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత 45 ఏళ్లగా నిస్వార్థంగా తెలుగు ప్రజల కోసం సేవ చేస్తున్నారని.. ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. తెలుగు ప్రజలకు, రాష్ట్రానికి, మాతృభూమికి సేవ చేయకుండా ఈ ప్రపంచంలో తనని ఏ శక్తీ ఆపలేదన్నారు.
-
For the past 45 years, I have selflessly served Telugu people. I am prepared to sacrifice my life to safeguard the interests of Telugu people. No force on earth can stop me from serving Telugu people, my #AndhraPradesh and my motherland.
— N Chandrababu Naidu (@ncbn) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Posted at 6 AM, 09th September 2023 pic.twitter.com/721COYldUd
">For the past 45 years, I have selflessly served Telugu people. I am prepared to sacrifice my life to safeguard the interests of Telugu people. No force on earth can stop me from serving Telugu people, my #AndhraPradesh and my motherland.
— N Chandrababu Naidu (@ncbn) September 9, 2023
Posted at 6 AM, 09th September 2023 pic.twitter.com/721COYldUdFor the past 45 years, I have selflessly served Telugu people. I am prepared to sacrifice my life to safeguard the interests of Telugu people. No force on earth can stop me from serving Telugu people, my #AndhraPradesh and my motherland.
— N Chandrababu Naidu (@ncbn) September 9, 2023
Posted at 6 AM, 09th September 2023 pic.twitter.com/721COYldUd
AP CID Arrests Chandrababu naidu : చంద్రబాబు అరెస్టు(Chandra Babu Arrest) విషయంలో సీఐడీతో పాటు పోలీసులు అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరుకు నంద్యాలలో హైడ్రామా నడిపించారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 I.P.C, 12, 13 (2) రెడ్ విత్ 13 (1) (C)(D) ప్రివన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైనందున.. అరెస్టు చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఉదయం ఐదున్నర గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో ఆయన కాన్వాయ్‌లోనే గుంటూరుకు తరలిస్తున్నారు. గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చంద్రబాబును తీసుకెళ్లనున్నారు.
పిచ్చోడు లండన్ కి... మంచోడు జైలుకా..? : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు వద్దకు వెళ్లకూడదని లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసుల హైడ్రామా సృష్టించారు. నోటీసులు అడిగితే డీఎస్పీ వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. లోకేష్ వద్దకు మీడియాని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రిని చూడడానికి తాను వెళ్లకూడదా అని లోకేష్ పోలీసులను నిలదీశారు. తన వెంట నాయకులు ఎవరు రాలేదని.. కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తున్నా.. అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే లోకేష్ బైఠాయించి నిరసన తెలిపారు. పిచ్చోడు లండన్‌కి.. మంచోడు జైలుకి.. ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగమని దుయ్యబట్టారు. జగన్ తల కిందులుగా తపస్సు చేసినా.. చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదని ఎద్దేవా చేశారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు
skill development case (స్కిల్ వెవలప్‌మెంట్ కేసు): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(AP Skill Development Case)కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో సీఐడీ పలు కీలక విషయాలు నమోదు చేసింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంది. జీవో నెంబర్ 4 ప్రకారం డిజైన్‌టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్, సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్బోస్కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ఈ సొమ్మును అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్ కంపెనీలకు తప్పుడు ఇన్ వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని పేర్కొంది.
Skill Development Case in Andhra Pradesh : 2017-2018 సంవత్సరంలో రూ.371 కోట్లలో.. దాదాపు రూ.241 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు సీఐడీ పేర్కొంది. అసలు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను రూ.3300 కోట్లలకు పెంచి, ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేశారని సీమెన్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యతో ఏపీ ప్రభుత్వంపై ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం చెల్లింపులలో భాగంగా అదనంగా రూ.371 కోట్లు భారం ఏర్పడింది. కానీ సీమెన్స్ ఇండస్ట్రీయల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ధర కేవలం రూ.58 కోట్లని బిల్లుల్లో నమోదైంది.
Chandrababu Responded to His Arrest: ఎన్ని కుట్రలు పన్నినా న్యాయమే గెలుస్తుంది.. చంద్రబాబు
Lokesh Protests in the Wake of Chandrababu Arrest: నా తండ్రిని చూడటానికి వెళ్లొద్దా: లోకేశ్ ఆగ్రహం
LIVE : నంద్యాల జిల్లాలో చంద్రబాబు అరెస్ట్.. ఉద్రిక్తత.. ప్రత్యక్ష ప్రసారం