ఏపీ సీఎం జగన్ మడమ తిప్పడు, మాట మార్చడు అంటూ చెప్పిన వైకాపా నేతలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్న మూడు రాజధానులపై ఏం సమాధానం చెప్తారంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు. జగన్ అమరావతిపై మాట మార్చిన తీరుపై 'మడమ తిప్పుడు, మాట మార్చుడు' అనే పేరిట వీడియో విడుదల చేశారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానికి జై కొట్టి, ఇప్పుడు జే-టర్న్ ఎందుకు తీసుకున్నారని మండిపడ్డారు. మూడు ముక్కలాటలో స్వార్థం లేకపోతే ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారని నిలదీశారు.
'మడమ తిప్పుడు, మాట మార్చుడు' వీడియో విడుదల - సీఎం జగన్పై లోకేశ్ ట్వీట్స్
జగన్ అమరావతిపై మాట మార్చిన తీరుపై 'మడమ తిప్పుడు, మాట మార్చుడు' అనే పేరిట నారా లోకేశ్ వీడియో విడుదల చేశారు. మూడు ముక్కలాటలో స్వార్థం లేకపోతే ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారని నిలదీశారు.