ఏపీ సీఎం జగన్ గారూ! స్థానిక యువతకు ఉపాధి కల్పన, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్, గార్డెన్ సిటీ, లంగ్‌స్పేస్ తో ప్రపంచానికే తలమానికంగా నవ్యాంధ్రకు రాజధానిగా మహానగరం కడతానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. నువ్వేమైతే చెప్పావో వాటికంటే ఘనమైన లక్ష్యాలతో చంద్రబాబు నిర్మించిన అమరావతి ప్రజారాజధానిని ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలి. మీరు కట్టాలనుకున్న రాజధాని కంటే గొప్పది చంద్రబాబు కట్టారని కూలగొడుతున్నారా? అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదని మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా? ఐదు కోట్ల ఆంధ్రులకు సమాధానం చెప్పి తీరాలి.
-నారా లోకేశ్
'మహానగరం కడతానని ప్రగల్భాలు పలికారు' - అమరావతి రైతు ఉద్యమం తాజా వార్తలు
ఏపీ సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. మహానగరం కడతానని ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. జగన్ కట్టాలనుకున్న రాజధాని కంటే గొప్పది చంద్రబాబు కట్టారని కూలగొడుతున్నారా? అని ట్వీట్ చేశారు.