ETV Bharat / state

'అక్రమ కేసులన్నింటికీ జగన్ వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తారు'

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేరుకున్నారు. జేసీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు లోకేశ్​కు కర్నూలులో తెదేపా నేతలు ఘన స్వాగతం పలికారు.

nara-lokesh-ananthapuram-tour-for-meeting-with-jc-prabhakar-reddy-family
'అక్రమ కేసులన్నింటికీ జగన్ వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తారు'
author img

By

Published : Jun 15, 2020, 4:55 PM IST

ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ కుటుంబ సభ్యులను నారా లోకేశ్ పరామర్శించారు. వాహనాల రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన అక్కడి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉదయమే.. హైదరాబాద్ నుంచి బయల్దేరి అనంతపురం చేరుకున్నారు. అంతకుముందు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తెలుగుదేశం నేతలు ఆయనకు స్వాగతం పలికారు. భౌతిక దూరం పాటిస్తూ పెద్దఎత్తున మద్దతు తెలిపారు. వాహనం దిగి వారందరికి లోకేశ్ అభివాదం చేశారు.

బీఎస్ -3 వాహనాలను బీఎస్ -4 గా మారుస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో 2 రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం కడప జైలుకు తరలించారు. వీరిని పరామర్శించేందుకు అధికారులను లోకేశ్ అనుమతి కోరగా... కొన్ని కారణాల వలన నిరాకరించారు. దీంతో ఆయన ఇవాళ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాడిపత్రిలో పరామర్శించారు.

ఇవీ చూడండి-మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.