ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రముఖ కవి, తెలంగాణ సాహితీ అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేష ఉపద్రవగాథ కావ్యం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు ఏలూరి రఘు ఆవిష్కరించారు. ఇందులో రఘుతో పాటు పుస్తక రచయిత నందిని సిధారెడ్డి, ప్రముఖ రచయిత నాళేశ్వరం శంకరం, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవిశ్రీప్రసాద్, విరహత్ అలీ, శంకర్, కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ వైరస్ అనేది ప్రపంచాన్నే ప్రశ్నార్థకంగా మార్చిందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ ఎన్నో విషగాథలను మిగిల్చిందన్నారు. ప్రకృతికి, మానవునికి ఉన్న బంధాలను, కరోనా వల్ల జరిగిన పరిణామాలను రచయిత నందిని సిధారెడ్డి అద్భుతంగా ఆవిష్కరించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ' కథలు చదివి ఉంటే 'దిశ' మరణించేది కాదు'