ETV Bharat / state

ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు - balakrishna birthday celebrations kukatpally

నటనా రంగంలో తనదైన శైలిని సృష్టించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్​లో ఘనంగా జరిగాయి. కూటక్​పల్లి, దోమలగూడలో అభిమానులు కేకు కట్​చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

nandamuri balakrishna birthday celebrations at hyderabad
ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు
author img

By

Published : Jun 10, 2020, 10:26 PM IST

తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు బాలకృష్ణ. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్​ ఘనంగా జరిగాయి.

దోమలగూడలో....

దోమలగూడలోని తెదేపా గ్రేటర్ కార్యాలయంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జి సాయిబాబా కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. నందమూరి వంశం ప్రజాసేవకే అంకితమన్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

కూకట్​పల్లి కేపీహెచ్​బీ కాలనీలో...

కూకట్​పల్లి కేపీహెచ్​బీ కాలనీలోని రమ్య గ్రౌండ్​లో డివిజన్ అధ్యక్షుడు సత్తార్ ఆధ్వర్యంలో అభిమానులు కేకు కట్​ చేసి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాలయ్య సేవా కార్యక్రమాలను కొనియాడారు. రాబోవు రోజుల్లో ఆయన సేవా కార్యక్రమాల్లో తాము భాగస్వాములు అవుతామన్నారు.

ఇదీ చూడండి: గ్రేటర్​లో కరోనా వ్యాప్తిపై కేంద్ర బృందం ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.