లాక్డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ విధించిన మారటోరియం పద్ధతిలో మూడు నెలల ఈఎంఐ వాయిదాల మీద ఎలాంటి వడ్డీ లేకుండా చూడాలన్న పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. వాయిదాలు కట్టే వారికి తీర్పు అనుకూలంగా వస్తుందని తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బూడిద నందారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
తమ లారీలు రోడ్డే ఎక్కపోగా నెలనెలా కట్టే వాయిదాలపై వడ్డీలు ఎలా కడతామని, సుప్రీంకోర్టుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న కోటి పది లక్షల లారీ యజమానులకు ఊరట కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: మే 12 నుంచి ప్రయాణికుల రైళ్ల కూత!