హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న 30 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు నాంపల్లి రైల్వే పోలీసులు. వారి జీతాల నుంచి కొంత నగదును సమకూర్చి ఈ కార్యక్రమం చేపట్టినట్లు రైల్వే ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
సాధారణ రోజుల్లో స్టేషన్ సమీపంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధిలేక కుటుంబం గడపడమే భారంగా మారిన ఆటో వాలాలకు సాయం చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఇదీ చూడండి: కదలనిమగ్గం... నిండని కడుపులు