ETV Bharat / state

నందకుమార్​ను విచారించేందుకు ఈడీకి నాంపల్లి కోర్టు అనుమతి - నందకుమార్​కు మరో సమస్య

ed
ed
author img

By

Published : Dec 24, 2022, 5:55 PM IST

Updated : Dec 24, 2022, 7:03 PM IST

17:49 December 24

నందకుమార్‌ను ఒకరోజు విచారణకు అనుమతించిన నాంపల్లి కోర్టు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నందకుమార్‌ ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రస్తుతం దూకుడు పెంచింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, సెవెన్‌హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ ఆవాలాను ఈడీ విచారించింది.

నందకుమార్‌ను విచారణకు అనుమతించాలని నాంపల్లి మూడో అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేసింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాము పరిశీలించామని.. అందులో రూ.వందల కోట్ల డీల్‌ గురించి చర్చించినందున మనీ లాండరింగ్‌కు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమిత్‌ గోయల్‌(పిటిషనర్‌) పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 15న 48/2022 నంబరుతో ఈసీఐఆర్‌ నమోదు చేశామన్నారు. ఈ కేసులో నిందితుడు నందకుమార్‌ను విచారించి కీలక సమాచారం రాబట్టేందుకు అనుమతించాలని కోరారు.

నందకుమార్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు నలుగురు అధికారులతో కూడిన బృందాన్ని అనుమతించేలా చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. నందకుమార్‌ను ఒక రోజు విచారణకు కోర్టు అనుమతించింది. దీంతో ఎల్లుండి చంచల్‌గూడ జైలులోనే నందకుమార్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

ఇవీ చూడండి..

ఆ కేసులో నందకుమార్​కు బెయిల్‌ మంజూరు.. అయినా జైల్లోనే ఉండక తప్పదు

'ఎమ్మెల్యేల ఎర కేసు'లో.. ముగ్గురు నిందితులు ఎలా కలిశారు..? ఏ కుట్ర పన్నారు..?

Last Updated : Dec 24, 2022, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.