ETV Bharat / state

PIL in High Court: డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై హైకోర్టులో పిల్​

రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భాజపా నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించక పోవడంతో.. ప్రజాధనం వృథాగా మారుతోందని పిటిషన్​లో పేర్కొన్నారు. పూర్తయిన ఇళ్లను వెంటనే కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

PIL in High Court
PIL in High Court
author img

By

Published : Oct 7, 2021, 9:43 AM IST

రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భాజపా నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా రాజకీయ కారణాలతో లబ్ధిదారులను కేటాయించడం లేదని పేర్కొన్నారు. దానివల్ల నిర్మాణం దెబ్బతినడంతో పాటు.. కొన్ని చోట్ల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయన్నారు. రాష్ట్రావిర్భావం నుంచి ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 2 లక్షల 91 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయని పిటిషన్​లో పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. 12 వేల 656 కేటాయించారని పేర్కొన్నారు. మరో 63వేల ఇళ్లు నిర్మించాల్సి ఉందని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు ఇచ్చామని తెలిపారు. పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1311 కోట్లు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 874 కోట్ల రుణం తీసుకుందని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించక పోవడంతో.. ప్రజాధనం వృథాగా మారుతోందని పిటిషన్ లో ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. అందువల్ల పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

ఇదీ చదవండి: gas rates hike: సామాన్యుడు విలవిల.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.