ETV Bharat / state

మాజీ మంత్రి గంటా అనుచరుడు నలంద కిశోర్‌ మృతి - గంటా అనుచరుడు నలంద కిశోర్‌ మృతి

ఏపీకి చెందిన మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌(65) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

nalanda-kishore-a-follower-of-former-minister-ganta-srinivas-has-died
మాజీ మంత్రి గంటా అనుచరుడు నలంద కిశోర్‌ మృతి
author img

By

Published : Jul 25, 2020, 2:02 PM IST

మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌(65) మృతి చెందారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణలతో నెల క్రితం సీఐడీ పోలీసులు నలంద కిశోర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఓ మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని అర్ధరాత్రి ఆయనను అరెస్టు చేశారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డుమార్గంలో తరలించి అక్కడ విచారించి వదిలేశారు.

అక్కడి నుంచి వచ్చిన తరువాత నలంద కిశోర్ ఆరోగ్యం సరిగా లేనట్లు తెలుస్తోంది. గత 5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇవాళ ఆకస్మికంగా గుండె పోటుతో నలంద కిశోర్ మరణించినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. మరోవైపు నలంద కిశోర్​ది కొవిడ్ మరణంగానూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలతో కిశోర్ తీవ్ర ఒత్తిడిలో ఉండేవారని తెలుస్తోంది.

ఇదీ చదవండి: కరోనాను మంత్రాలతో తగ్గిస్తాడు.. ఈ కరోనా బాబా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.