ETV Bharat / state

గోషామహల్​లో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు.. తప్పిన పెను ప్రమాదం.. - గోషామహల్​లోని చాక్నవాడి వద్ద కూలిపోయిన నాలా

Road collapsed at Goshamahal : హైదరాబాద్ గోషామహల్‌లో పెను ప్రమాదం తప్పింది. చాక్నవాడిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూపంకం వస్తే ఎలా ఉంటుందో అలా రోడ్డు నిట్టనిలువుగా చీలిపోయి.. అందులో పలువురు పడిపోయారు. వాహనాలు వాటిలో చిక్కుకుపోయాయి. అందరికీ స్వల్ప గాయాలే కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Nala collapsed at Goshamahal in Hyderabad
నాలా కుంగిపోవడం
author img

By

Published : Dec 23, 2022, 10:43 PM IST

Road collapsed at Goshamahal : హైదరాబాద్‌ గోషామహల్‌ ప్రాంతంలోని చాక్నవాడి మార్కెట్‌ ఒక్కసారిగా భీతిల్లింది. శుక్రవారం మార్కెట్ వీధిలో రోడ్డు పక్కన వ్యాపారుల కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్కడే నిల్చున్న కొందరు అందులో పడిపోవటంతో.. స్వల్ప గాయాలయ్యాయి. మార్కెట్లో విక్రయాలకు తెచ్చిన కూరగాయలు అందులో పడిపోయాయి. రోడ్డు కుంగిపోవటంతో భారీ గొయ్యి ఏర్పడటంతో పక్కనే ఉన్న వాహనాలు అందులో పడి.. దెబ్బతిన్నాయి. రోడ్డు కుంగే సమయంలో రద్దీ తక్కువగా ఉండటం.. వాహనాల రాకపోకలు లేకపోవటంతో పెను ప్రమాదమే తప్పింది.

హైదరాబాద్​ గోషామహల్​ వద్ద కుంగిపోయిన నాలా

రోడ్డు కుంగిన చోటకాకుండా మరికొంత దూరంలో నాలా ఉంది. పెద్ద వర్షాలు వచ్చినప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని.. ఉన్నట్లుండి రోడ్డు కుంగిపోవటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు.. రోడ్డు కుంగిపోవటానికి గల కారణాలను పరిశీలించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సైతం.. అక్కడకి చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షించారు. నాలా ఆక్రమణలకు గురి కావడంతోనే.. ప్రమాదం జరిగిందని మంత్రి తలసాని తెలిపారు.

"ఇది అఫ్ఘల్​సాగర్​ ప్రధానమైన కాలువ. ఇటువంటి ప్రమాదం జరిగిన ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమీ కాకపోవడం అందరం ఊపిరి పీల్చుకోవలసిన విషయం. నాలా ఆక్రమణలకు గురికావడమే ప్రమాదానికి ప్రధాన కారణం. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంటుంది." - తలసాని శ్రీనివాస యాదవ్​, మంత్రి

నాలా ప్రమాదం గురించి మాట్లాడుతున్న మంత్రి తలసాని

సంఘటనా స్థలాన్ని జీహెచ్​ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పరిశీలించారు. నాలాను 40 ఏళ్ల కిందట నిర్మించారని.. చుట్టూ ఆక్రమణల వల్ల ప్రమాదం జరిగిందని ఆమె తెలిపారు. ఈ ప్రాంతంలో హెవీ మోటారు వెహికల్స్​ని నిలుపుతున్నారు.. నడుపుతున్నారు. అందువల్ల ఇదే నాలా కూలిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పారు.

"ఈ ప్రాంతంలో ఎక్కువగా షాపులు ఉన్నాయి.. ఈ షాపుల్లో ఎక్కువ మొత్తంలో సామాగ్రిని ఉంచడం వల్ల ఈ ప్రమాదానికి ఒక కారణం. అలాగే 40 ఏళ్ల కిందట నిర్మించిన నాలాను ఆక్రమించి దీనిని కప్పేసి.. అందరూ అక్రమ నిర్మాణాలు చేశారు. ఇదే నాలా కూలిపోవడానికి ప్రధాన కారణం." - విజయలక్ష్మి, జీహెచ్​ఎంసీ మేయర్​

జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి

2009లో నాలా పనులు నాసిరకంగా చేశారని.. అందుకే ఈ పరిస్థితి వచ్చిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని.. నష్టపరిహారం చెల్లించాలంటూ విజయారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.