Nakka Anandh Babu Respond on MLC Ashok Babu Bail Issue: ఎమ్మెల్సీ అనంతబాబును శిక్షించి.. దళిత కుటుంబానికి న్యాయం చేసే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉంటే.. సుబ్రహ్మణ్యం హత్యకేసును ఎందుకు సీబీఐకి అప్పగించలేదని ఆంధ్రప్రదేశ్ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు నిలదీశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబును కాపాడటానికి పోలీస్ శాఖ శతథా ప్రయత్నించిందని ఆరోపించారు.
జిల్లా ఎస్పీనే హంతకుడిని 'గారు' అని, సుబ్రహ్మణ్యం హత్యలో అతని ప్రమేయమే లేదన్నారని గుర్తు చేశారు. వైకాపా నుంచి తూతూమంత్రంగా సస్పెండ్ చేసి, ప్రభుత్వ కార్యక్రమాల్లో అనంతబాబు ప్లెక్సీలు, ఫోటోలు పెట్టి పాలాభిషేకాలు జరిపారని ధ్వజమెత్తారు. రాజమండ్రి జైల్లో వైకాపా ప్రజాప్రతినిధులు, మంత్రులు అనంతబాబుతో ఒకటై అతనికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారన్నారు. అనంతబాబు లాంటి పేరు మోసిన నేరస్థులతో దళితుల్ని హతమార్చాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశంలా ఉందని ఆరోపించారు.
ఇవీ చదవండి :