తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టులు అప్లోడ్ అవటం వల్ల అకౌంట్ హ్యాక్ అయినట్టు గ్రహించానని నైనా జైస్వాల్ తెలిపారు.
హ్యాకర్స్పా పాస్వర్డ్ మార్చేసి కొన్ని వీడియోలు అప్‌లోడ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐయామ్ నైనా జైస్వాల్ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్‌ను కొనసాగిస్తున్నట్టు…అందులో 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్టు ఆమె ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు తెలిపారు. సెలబ్రెటీల అకౌంట్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తారని… తిరిగి వారి అకౌంట్ వారికి అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తుంటారని ఏసీపీ అన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య