ETV Bharat / state

Nagam Janardhan Reddy Joined BRS : బీఆర్​ఎస్​లో చేరిన నాగం జనార్ధన్​ రెడ్డి.. కండువా కప్పిన ఆహ్వానించిన కేసీఆర్​ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక 2023

Nagam Janardhan Reddy Joined BRS in Presence of KCR : మాజీ మంత్రి నాగం జనార్ధన్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్​ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​.. తెలంగాణ భవన్​లో వీరికి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

Nagam Janardhan Reddy
Nagam Janardhan Reddy Joined BRS in Presence of KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 2:29 PM IST

Nagam Janardhan Reddy Joined BRS : రాష్ట్ర ఎన్నికల సమయంలో బీఆర్​ఎస్​ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్ధన్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​ రెడ్డిలు.. బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. వీరిరువురిని తెలంగాణ భవన్​లో కేసీఆర్​.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడారు.

Vishnu Vardhan Reddy Joined in BRS Today : 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో నాగం జనార్ధన్​ రెడ్డి జైలుకు వెళ్లారని సీఎం కేసీఆర్​ గుర్తు చేశారు. ఆనాడు నాగం జనార్ధన్​ రెడ్డి, విష్ణువర్ధన్​ రెడ్డి, జైపాల్​రెడ్డిని తానే పార్టీలోకి ఆహ్వానించానని పేర్కొన్నారు. పీజీఆర్​ తనకు వ్యక్తిగత మిత్రుడని.. విష్ణువర్ధన్​ రెడ్డి భవిష్యత్తు తన బాధ్యత అని మాట ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. తాను, నాగం జనార్ధన్​రెడ్డి కలిసి పని చేశామని.. ఎన్నో పోరాటాలు చేశామని చెప్పారు. నాగం సలహాలు, సూచనలు తీసుకొని 14 నియోజకవర్గాలు గెలవాలని అభ్యర్థులకు సూచించారు. మాగంట గోపీనాథ్​, విష్ణువర్ధన్​ రెడ్డి కలిసి సమన్యయంతో పని చేయాలన్నారు.

Knife Attack on BRS MP Prabhakar Reddy : రాజకీయాల్లో కొన్ని వ్యతిరేక శక్తులు ఉంటాయని.. సోమవారం రోజున బీఆర్​ఎస్​ ఎంపీ ప్రభాకర్​ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. భగవంతుడి దయవల్ల ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఇలాంటి హేయమైన దాడులు తెలంగాణలో ఎప్పుడూ జరగలేదని.. ఇక మీదట జరిగితే సహించబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

Nagam Janardhan Reddy Join BRS : బీఆర్‌ఎస్‌ గూటికి నాగం జనార్దన్‌ రెడ్డి.. త్వరలోనే చేరిక

Mahbubnagar District Latest Politics 2023 : పాలమూరు జిల్లాలో జోరుగా జంపింగ్​లు.. ఇతర పార్టీల్లో చేరేందుకు అసంతృప్తుల సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.