Nagam Janardhan Reddy Join BRS : మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన స్వగృహానికి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వెళ్లి ఆయనతో కలిసారు. అనంతరం నాగం మాట్లాడుతూ.. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. తన రాజీనామా లేఖను.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారని తెలిపారు.
KTR Reaction on Nagam Janardhan Reddy Join : సీఎం కేసీఆర్‌కు నాగం జనార్దన్‌రెడ్డి మంచి మిత్రుడని బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారి ఇద్దరి మధ్య 40 ఏళ్ల స్నేహం ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ కోరిక మేరకు ఆయనని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించామని తెలిపారు. ఆయనకు పార్టీలో మంచి స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలో చర్చించామని పేర్కొన్నారు. రాష్ట్రం సిద్దించాలని కోరుకున్న వ్యక్తుల్లో ఒకరని అన్నారు. అందరం సమష్టిగా ఎన్నికల్లో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.
Nagam Janardhan Reddy Meet KCR : నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసారు. సముచిత స్థానం, పార్టీలోని చేరిక.. తదితర విషయాల గురించి చర్చించుకున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. ప్రచారంలో తదుపరి కార్యచరణపై ముఖ్యంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
Nagam Janardhan Reddy Resign Congress : నాగర్ కర్నూల్ నుంచి టికెట్ దక్కపోవడంతో ఆయన.. పార్టీ నాయకులపై నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సీట్లు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. తాజాగా రాజీనామా చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావులు హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి వెళ్లి కలిసారు. వారు కాసేపు చర్చించిన తరవాత అధికారికంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు నాగం జనార్దన్ రెడ్డి ప్రకటించారు. 2018 ఏప్రిల్ గత టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని ఆయన తెలిపారు.
"కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను. కేటీఆర్, హరీశ్‌రావు నన్ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చేరతాను. ఏళ్ల నుంచి కష్టపడిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. ఉదయం వచ్చిన వారికి కాంగ్రెస్‌లో టికెట్ ఇస్తున్నారు."- నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ మంత్రి
Marri Janarthan Reddy Reaction on Nagam Join : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని నాగం జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్వాన్నమైన స్థితిలోకి వచ్చిందన్న అయన.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. సీనియర్ నాయకుడైన నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగంతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
TDP leader Ravula Chandrasekhar Reddy joining BRS : బీఆర్‌ఎస్‌లో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి