ETV Bharat / state

దౌర్జన్యాలు, అరాచకాలకు చిరునామా.. వైసీపీ: నాగబాబు - Janasena leader Nagababu latest news

Nagababu Interesting Comments: జనసేన నేత నాగబాబు ఏపీలోని కర్నూలులో నిర్వహించిన వీర మహిళల సమావేశంలో వైసీపీపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆశ్చర్యపరిచే సమాధానాలు ఇచ్చారు.. అవేంటో తెలుకుందామా మరీ..!

Nagababu Interesting Comments
Nagababu Interesting Comments
author img

By

Published : Jan 21, 2023, 3:39 PM IST

Nagababu Interesting Comments: జనసేన నాయకుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అసలు పార్టీనే కాదని.. దౌర్జన్యాలు, అరాచకాలకు చిరునామా అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది? ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది.. అధినేత పవన్‌ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. పవన్‌పై పోటీ చేస్తానన్న అలీ వ్యాఖ్యలపై స్పందించడం దండగని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలులో నిర్వహించిన వీర మహిళల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది? ఎవరు ఎక్కడ పోటీ చేస్తారని పవన్​ కల్యాణ్ చెబుతారనిన నాగబాబు తెలిపారు. పొత్తులపై ఇప్పటి వరకూ సమాచారం లేదని చెప్పారు. అందుకే దాని గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు రాయలసీమ జిల్లాల్లో పార్టీ బలంగా ఉందని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని నాగబాబు స్పష్టం చేశారు.

" పవన్​ కల్యాణ్ చెప్తారు. ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారనేది. ముందుగా, అలయన్స్ నుంచి సమాచారం వస్తే కదా ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది తెలుస్తుంది. ఏమీ సమాచారం రాకముందే మనం కానీ, నేను కానీ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. వైసీపీ అది ఒక పార్టీనా అది.. చాలా అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం ఇవన్నీ కలిస్తే వైసీపీ. పవన్‌పై అలీ వ్యాఖ్యలకు ఎటువంటి కామెంట్ లేవు." - నాగబాబు, జనసేన నేత

దౌర్జన్యాలు, అరాచకాలకు చిరునామా.. వైసీపీ: నాగబాబు

ఇవీ చదవండి: గోల్డ్‌ ఏటీఎం తయారు చేసింది మనోడే..!

'నాన్న నన్నెవరో కిడ్నాప్ చేశారు.. రూ.2 లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకు ఖతం'.. తండ్రిని బెదిరించిన కొడుకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.