లాక్డౌన్ వల్ల పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా వారికి సాయం చేసేందుకు పలువురు దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తున్నారు. హైదరాబాద్ నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిశేఖర్ 3వేల మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కరోనా వ్యాప్తి అరికట్టాలంటే లాక్డౌన్ నిబంధనలు పాటించడమొకటే మార్గమని కార్పొరేటర్ శాంతి అన్నారు. లాకౌడౌన్ సమయంలో పేదలకు సాయం చేయడానికి వీలైనంత ఎక్కువ మంది ముందుకు రావాలని కోరారు.